"పుష్ప: ది రూల్" విషయంలో ఆ తప్పులు చేయొద్దు" అంటున్న అల్లు అర్జున్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పుష్ప: ది రైజ్".

Arun Chilukuri
Updated on: 20 Feb 2022 5:16 PM IST
Allu Arjun Does not Want to Repeat This Mistake with Pushpa The Rule
X

"పుష్ప: ది రూల్" విషయంలో ఆ తప్పులు చేయొద్దు" అంటున్న అల్లు అర్జున్ 

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పుష్ప: ది రైజ్". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా విడుదల తేదీ విషయంలో అల్లు అర్జున్ చాలా కంగారు పెట్టారని సమాచారం. ముందుగానే పుష్ప రిలీజ్ డేట్ ను చెప్పేసి సుకుమార్ ని ఇరికించే చేశాడు బన్నీ. ఆ తర్వాత తనకి కి కరోనా రావడం, సుక్కు కి డెంగ్యూ రావడం వల్ల షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతూ వచ్చింది. ఆఖరికి ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా సుకుమార్ హాజరు కాలేని పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని అనుకున్న తేదీకి విడుదల చేసి మంచి హిట్ ను అందించారు.

ఇప్పుడు ఆ కంగారు "పుష్ప: ది రూల్" విషయంలో జరగకూడదని అల్లు అర్జున్ చిత్ర బృందానికి చెబుతున్నారట. షూటింగ్ తొందరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా నెమ్మదిగా చేయాలని ప్లాన్ చేస్తూ ప్రమోషన్స్ ని చక్కగా ప్లాన్ చేయాలని అల్లు అర్జున్ చిత్ర బృందానికి చెబుతున్నారట. అలాగే అందరికి కాల్షీట్స్ కూడా ముందుగానే తీసుకొని ఉంచుకుంటే ఆఖరి నిమిషంలో కంగారు తప్పుతుందని ఇక షూటింగ్ కూడా అనుకున్న తేదీకి పూర్తిచేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారట. అలాగే రిలీజ్ డేట్ ని ముందుగానే అనుకోని అధికారికంగా ప్రకటించాలని కూడా సుక్కు కి చెప్పినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story