Allu Arjun: 'పుష్ప' సినిమాలో విలన్ ఎవరో తెలుసా!

Allu Arjun: Do you know who the Villain is in the movie Puspa?
x

Allu Arjun:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 'పుష్ప ' లో విలన్ ని ఆ చిత్ర యూనిట్ పరిచయం చేసింది.

Allu Arjun: ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్నఅల్లు అర్జున్ హీరోగా పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప' సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో కలపను అక్ర‌మంగా రవాణా చేసే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో విల‌న్ ఎవ‌రన్న విష‌యాన్ని ఆ సినిమా యూనిట్ ఈ రోజు ప్ర‌క‌టించింది. ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

విలన్ గా మలయాళ నటుడు...

మలయాళ నటుడు ఫవాద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు చెబుతూ ఆయ‌న ఫొటోను మైత్రిమూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్టు అప్ప‌ట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి విజ‌య్ సేతుప‌తి తప్పుకున్న విష‌యం తెలిసిందే. కేర‌ళ‌లో అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. అందుకే ఈ సినిమా కోసం మ‌ల‌యాళ న‌టుడినే విల‌న్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories