మహేష్ బాబు సినిమాలో అల్లు అర్జున్ కూతురు..

Allu Arjun Daughter Is Acting In Mahesh Babu Movie
x

మహేష్ బాబు సినిమాలో అల్లు అర్జున్ కూతురు.. 

Highlights

* మహేష్ బాబు సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎందుకు ఎదురుచూస్తున్నారో తెలుసా??

Mahesh బాబు: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి తెలియని వారు ఉండరు. అప్పుడప్పుడు అల్లు అర్జున్ షేర్ చేసే వీడియోల వల్ల అర్హ కి సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ వచ్చేసింది. ఆమెకు సంబంధించిన అన్ని వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా సమంత హీరోయిన్గా గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న "శాకుంతలం" సినిమాలో కూడా అర్హ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు కానీ అప్పుడే అర్హ మరొక సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఏకంగా అర్హ సూపర్ సార్ మహేష్ బాబుతో వెండి తెర మీద కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక చిన్న పాప పాత్ర కీలకంగా ఉండబోతుందట. ఆ పాత్రకు అల్లు అర్హ బాగా సెట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. అల్లు అర్జున్ తో "జులాయి", "సన్నాఫ్ సత్యమూర్తి", "అల వైకుంఠపురంలో" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ అడిగితే బన్నీ కూడా కచ్చితంగా ఒప్పుకుంటాడని చెప్పుకోవాలి.

ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఇక త్రివిక్రమ్ కూడా అర్హ ని రంగంలోకి దించే విధంగానే స్క్రిప్ట్ ని మార్చారు అని తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాలో అల్లు అర్జున్ కూతురు అంటేనే సినిమాకి ఇంకా బజ్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాక అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories