Allu Arjun: రాజమౌళితో సినిమా ఉంటుంది అంటున్న బన్నీ

Allu Arjun: రాజమౌళి తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

admin1
Published on: 15 Dec 2021 3:47 PM IST
Allu Arjun Clarifies about Rajamouli Movie
X

రాజమౌళి తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్(ఫైల్-ఫోటో)

Allu Arjun: ఇప్పటిదాకా ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు కానీ అల్లు అర్జున్ హీరోగా మాత్రం రాజమౌళి సినిమా తీయలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రాజమౌళితో సినిమా చేసే అవకాశం ఉందా అని అడగగా అల్లు అర్జున్ ఒక ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు.

"రాజమౌళి గారి తో పనిచేయాలని ఎవరికి మాత్రం ఉండదు నాకు కూడా ఆయనతో పనిచేయాలని ఉంది. నేను ఇదే విషయాన్ని ఆయనకు చెప్పాను. కచ్చితంగా ప్లాన్ చేస్తాను అని అన్నారు" అని చెప్పుకొచ్చారు బన్నీ.

ప్రస్తుతం రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కూడా పూర్తయ్యాక రాజమౌళి బన్నీతో సినిమా చేస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా ఈ నెల 17న విడుదల కాబోతోంది. మరో వైపు అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మాత్రమే కాక బోయపాటి తో ఒక సినిమా మరియు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది.

admin1

admin1

Next Story