నవదీప్ ఆఫీస్ కోసం బన్నీ చీఫ్ గెస్ట్

నవదీప్ ఆఫీస్ కోసం బన్నీ చీఫ్ గెస్ట్
x
Highlights

ఎప్పుడో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో వెండితెరపై కనిపించింది లేదు. తాజాగా అల్లు అర్జున్...

ఎప్పుడో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో వెండితెరపై కనిపించింది లేదు. తాజాగా అల్లు అర్జున్ 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', సినిమాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ సినిమా త్వరలో లాంచ్ అవ్వనుంది. అయితే తాజాగా బన్నీ ముఖ్యఅతిథిగా ఒక వేడుకకు విచ్చేయనున్నారు. టాలీవుడ్ నటుడు నవదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నవదీప్ కొందరు బిజినెస్ పార్టనర్ లతో కలిసి 'సి స్పేస్' అనే ఒక టాలెంట్ హబ్ ను కట్టారు. ఈనెల 6వ తేదీన అది ఓపెన్ అవ్వనుంది.

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ ఓపెనింగ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. చాలామంది టాలెంట్ ఉన్న వారికి సి స్పేస్ ఒక మంచి ప్లాట్ఫారంగా మారబోతోంది. ఈ సి స్పేస్ ఓపెనింగ్ కోసం బన్నీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. నిజానికి ఈ సి స్పేస్ లో ఒక బిజినెస్ పార్టనర్ గీతాఆర్ట్స్ బ్యానర్ కు చాలా కావాల్సిన వ్యక్తి కాబట్టి అల్లు అర్జున్ చాలా త్వరగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ తో బన్నీ ప్రాజెక్టు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories