Allu Arjun: "పుష్ప 2" లో బన్నీ రోల్ అల ఉండబోతోందా?

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన “పుష్ప: ది రైజ్” సినిమాకి సీక్వెల్ గా "పుష్ప: ది రూల్‌" పై దృష్టి పెట్టారు.

Arun Chilukuri
Updated on: 7 Jun 2022 4:00 PM IST
Allu Arjun Character in Pushpa 2 Movie go Viral on Social Media
X

Allu Arjun: "పుష్ప 2" లో బన్నీ రోల్ అల ఉండబోతోందా?

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన "పుష్ప: ది రైజ్" సినిమాకి సీక్వెల్ గా "పుష్ప: ది రూల్‌" పై దృష్టి పెట్టారు. ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా "పుష్ప: 2″ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డీ గ్లామరస్ పాత్ర అయినప్పటికీ "పుష్ప 1" లో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్‌ పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు "పుష్ప 2" లో అల్లు అర్జున్ ఒక నడివయసు పాత్రలో కనిపించనున్నట్టుగా ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

అయితే ఈ పాత్ర సినిమాలో కేవలం ఒక సన్నివేశానికి మాత్రమే పరిమితమా లేక సినిమా మొత్తం ఇలాగే ఉంటుందా అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story