అల్లు అర్జున్‌ కార్వాన్‌కు ప్రమాదం

*ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం *పుష్ప మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌

Samba Siva Rao
Published on: 6 Feb 2021 5:29 PM IST
అల్లు అర్జున్‌ కార్వాన్‌కు ప్రమాదం
X

టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కార్‌వాన్ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ వాహనంలో మేకప్ టీమ్ వున్నట్లుగా తెలుస్తోంది. కార్‌వాన్‌లో అల్లు అర్జున్ లేడని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. రంపచోడవరంలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మూవీ యూనిట్ తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా.. ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి చిత్ర యూనిట్ ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లు అర్జున్ కార్ వాన్ కు ప్రమాదం వార్త రాగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురైయ్యారు. అందులో బన్నీ లేకపోవడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

పుష్ప సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి బృందానికి ఏదీ కలిసిరావడంలేదు. ఇటివలే పుష్ప మూవీకి స్టిల్ ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా కార్వాన్ ప్రమాదం జరగడంతో పుష్ప టీం సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కార్వన్ ప్రమాదంపై అల్లుఅర్జున్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story