Allu Arjun: అల్లు అర్జున్ ఔదార్యం, రోడ్డు పక్క కాకా హోటల్ లో బ్రేక్ ఫాస్ట్

Allu Arjun: కృష్ణుని పాలెంలో పూరిపాక హోటల్ లో దోశె తిన్న బన్నీ, హోటల్ యజమాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న అల్లు అర్జున్

admin1
Updated on: 8 Oct 2021 5:22 PM IST
Allu Arjun Ate Breakfast at Roadside Kaka Hotel in Kak| Allu Arjun News Today
X

అల్లు అర్జున్ ఔదార్యం, రోడ్డు పక్క కాకా హోటల్ లో బ్రేక్ ఫాస్ట్

Allu Arjun: హీరో అల్లు అర్జున్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. పుష్ప సినిమా షూటింగ్ కోసం కొన్నాళ్లుగా కాకినాడలో ఉన్న అల్లూ అర్జున్ రోడ్డు పక్క ఓ కాకా హోటల్ లో టిఫిన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పూరిపాకలో నిర్వహిస్తోన్న హోటల్ లో అర్జున్ బ్రేక్ ఫాస్ట్ గా దోశ ఆర్డర్ చేసి తిన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా అక్కడే టిఫిన్ చేసారు. తన హోటల్ లోకి హీరో రావటం జీవితాతం మరచిపోలేనని, బిల్లు చెల్లించటమే కాకుండా అల్లు అర్జున్ తమకు అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్లారనీ హోటల్ యజమాని శివ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

పూరిపాకలో తమ కష్టసుఖాలు తెలుసుకున్న అల్లు అర్జున్ తమను హైదరాబాద్ పిలిపించి ఉద్యోగం ఇస్తాననీ హామీ ఇచ్చారనీ అంటున్నారు. ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో భాగంగా కాకినాడ సీపోర్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. కాకినాడలో బస చేసిన ఆయన ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు వెళ్తున్నారు.

admin1

admin1

Next Story