Movie News: మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఓకే చేసిన స్టైలిష్ స్టార్

Movie News: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

Arun Chilukuri
Updated on: 25 Sept 2022 2:01 PM IST
Allu Arjun and Trivikram Srinivas to Join Hands for the Fourth Time
X

Movie News: మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఓకే చేసిన స్టైలిష్ స్టార్

Movie News: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ఆ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. తాజాగా ఇప్పుడు ఈ కాంబోలో నాలుగవ సినిమా కూడా పట్టాలెక్కబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలవడనుంది.

వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా "జులాయి" అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో మళ్లీ ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఈ మధ్యనే వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన "అల వైకుంటపురంలో" సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నాలుగవ సినిమా కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో తన నాలుగవ సినిమాని మొదలుపెట్టబోతున్నారు. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ కూడా "పుష్ప 2" షూటింగ్ పూర్తి చేయబోతున్నారు అని సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story