logo

మొత్తానికి పట్టాలెక్కిన బన్నీ త్రివిక్రమ్ సినిమా

మొత్తానికి పట్టాలెక్కిన బన్నీ త్రివిక్రమ్ సినిమా
Highlights

దాదాపు మూడు నెలల క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండబోతుంది అని...

దాదాపు మూడు నెలల క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండబోతుంది అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమా ఇవాళ లాంచ్ అయింది. ఈరోజు ఉదయం హైదరాబాద్లో త్రివిక్రమ్ సినిమా ముహూర్తం షాట్ చిత్రీకరించారు. బన్నీ స్వయంగా ఫస్ట్ క్లాప్ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి, సినిమాలో బన్నీ పాత్ర గురించి మరియు సినిమా కథ గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కానీ వీటిలో ఏ ఒక్క దానిని కూడా దర్శక నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య బంధాన్ని చాలా బాగా చూపించబోతున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 24 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లు అరవింద్ మరియు రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.


లైవ్ టీవి


Share it
Top