Allu Arha: వరల్డ్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ గారాల పట్టి

* రెండు నెలల్లోనే ఏకంగా 50 మందికి పైగా చెస్‌లో ట్రైనింగ్‌ ఇచ్చిన అర్హ

Shilpa
Published on: 21 Nov 2021 6:09 PM IST
Allu Arjun and Sneha Little Princes Arha got World Youngest Chess Trainer Award on her Birthday
X

వరల్డ్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ గారాల పట్టి(ఫైల్ ఫోటో) 

Allu Arha: అల్లు అర్జున్ కూతురు అర్హ అల్లరికి హద్దులే ఉండవు అనే సంగతి అందరికి తెలిసిందే. అర్హ అత్యంత చిన్న వయసులోనే చెస్‌లో శిక్షణ ఇస్తూ ప్రఖ్యాత నోబుల్‌ అవార్డును అందుకుంది. ఓ చెస్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్న అర్హ, రెండు నెలల్లోనే ఏకంగా 50 మందికి పైగా చెస్‌లో ట్రైనింగ్‌ ఇచ్చింది.

దీంతో అల్లు అర్హ ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ ప్రతినిధులు అర్హ నైపుణ్య పరీక్షను నిర్వహించగా అర్హ తన సత్తా చాటడంతో వరల్డ్‌ యంగెస్ట్‌ చెస్‌ ట్రైనర్‌గా అవార్డును అందించారు. ఇక అర్హ చెస్‌ పరీక్షలో పాల్గొన్న సమయంలో తీసిన వీడియోను అర్హ తల్లి అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అల్లు అర్జున్ అభిమానులు అర్హపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పుట్టిన రోజున తన పేరెంట్స్‌కు మరిచిపోలేని బహుమతి ఇచ్చింది అర్హ. 'శాకుంతలం' సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అర్హ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకునేల నటించింది.


Shilpa

Shilpa

Next Story