Allu Arjun: ఈ సినిమా తర్వాతే బోయపాటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్న బన్ని

Allu Arjun: "అఖండ" సినిమా పై ఆధారపడి ఉన్న అల్లు అర్జున్ సినిమా

admin1
Published on: 20 Oct 2021 3:35 PM IST
Allu Arjun and Boyapati Srinu Movie Based on Akhanda Movie
X

అఖండ సినిమా పై ఆధారపడి ఉన్న అల్లు అర్జున్ తరువాత మూవీ (ఫైల్ ఇమేజ్)

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "పుష్ప" సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. డిసెంబర్ 17న క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తన తదుపరి సినిమా ఇంకా ఎనౌన్స్ చేయలేదు. గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపించాయి కానీ ప్రస్తుతానికి ఆ హడావిడి కనిపించడం లేదు. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్ని ఒక సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

కానీ ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. త్వరలో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "అఖండ" సినిమా రిజల్ట్ ని బట్టి బన్నీ ఈ సినిమా చేద్దామా వద్దా అని నిర్ణయించుకోబోతున్నారట. "అఖండ" సినిమా త్వరలోనే క్రిస్మస్ సందర్భంగా విడుదలకి సిద్ధమవుతుంది. కాబట్టి అప్పటి దాకా ఆగి సినిమా రిజల్ట్ తెలిసిపోతే "పుష్ప" తర్వాత బోయపాటి సినిమా చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోబోతున్నారు బన్నీ. ఇక రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న "పుష్ప" సినిమాలో మలయాళం స్టార్ ఫాహధ్ ఫాసిల్ మరియు కమెడియన్ సునీల్ విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు.

admin1

admin1

Next Story