నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఆదరగోడుతున్న బన్నీ 'అలవైకుంఠపురములో'..

నెట్‌ఫ్లిక్స్‌లోనూ  ఆదరగోడుతున్న బన్నీ అలవైకుంఠపురములో..
x
Highlights

ఈ ఏడాది అలవైకుంఠపురములో చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాలోని పాటలు అయితే బాష రాని వారితో కూడా స్టెప్స్ వేయించాయి.

ఈ ఏడాది అలవైకుంఠపురములో చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాలోని పాటలు అయితే బాష రాని వారితో కూడా స్టెప్స్ వేయించాయి. ఇక కలెక్షన్ల పరంగా అయితే దుమ్ముదులుపింది ఈ చిత్రం. అయితే ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఆదరగోడుతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాదిలో అత్యధికంగా చూసిన సినిమాల్లో టాప్‌-10 చిత్రాలను ఆ సంస్థ ప్రకటించింది. అందులో అల్లు అర్జున్ అలవైకుంఠపురములో చిత్రం టాప్ వన్ లో నిలవడం విశేషం. ఈ సినిమా తర్వాత దుల్కర్‌ సల్మాన్ కన్నం కన్నం కొల్లయ్యదితల్‌, అన్నాబెన్‌ మలయాళ చిత్రం కప్పెలా, సత్యదేవ్‌ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రమే ఈ 'అలవైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలకి ముందు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు, ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories