అల వైకుంఠపురములో ట్విట్టర్ రివ్యూ : బన్ని ఇరగదీశాడు కానీ !

అల వైకుంఠపురములో ట్విట్టర్ రివ్యూ : బన్ని ఇరగదీశాడు కానీ !
x
Highlights

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరవాత హీరో అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నుంచి వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో


జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరవాత హీరో అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నుంచి వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో... భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో అలనాటి తార టబు రీఎంట్రీ ఇవ్వడం, తమన్ అందించిన పాటలకి మంచి క్రేజ్ రావడం, టీజర్, ట్రైలర్స్ లలో త్రివిక్రమ్ మార్క్ కనిపించడం సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి,

సినిమా భారీ అంచనాల నడుమ విడుదలవుతుండడంతో అన్ని ధియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉదయం 7 నుంచే ప్రీమియర్ షోస్ పడగా, యుఎస్ లో రాత్రి నుంచే ప్రిమియర్ షోలు మొదలు అయాయి. ఈ సినిమాని చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. బన్ని ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ యాక్టింగ్ , డాన్స్ ఇరగాదీశాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్‌ అవుట్ అయ్యిందని, ఇక ఇంటర్వెల్ బ్లాక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందంటున్నారు.

ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పంచులు బాగా పేలాయని అభిప్రాయపడుతున్నారు. కానీ మొదటిభాగంతో పోలిస్తే రెండవ భాగం నెమ్మదించిందని అంటున్నారు. మొదటిభాగంతో పోలిస్తే రెండవ భాగంలో వావ్ అనే సన్నివేశాలు పెద్దగా లేవని అంటున్నారు. ఇక సినిమాలో బన్ని తర్వాత మురళీశర్మ పాత్ర బాగుందని, తండ్రి పాత్రలో ఇరగాదీశాడని అంటున్నారు. సినిమాలో హీరోయిన్స్ ఇద్దరు గ్లామర్ షోకి మాత్రమే పరిమితం అయ్యారని అంటున్నారు. ఫ్లాట్ నరేషన్ తో సినిమా సాగిందని అంటున్నారు.

తమన్ అందించిన పాటలు స్క్రీన్ పైన బాగున్నాయని అంటున్నారు. నేపధ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయిందని అంటున్నారు. పి యస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని అంటున్నారు. సముద్రఖని, సుశాంత్‌, వెన్నల కిశోర్‌, నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణ లాంటి నటులను ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టాక్ అయితే సినిమాకు సూపర్‌ పాజిటివ్‌ టాక్‌ అయితే ఏమీ లేదన్న అభిప్రాయాలూ బలంగా వినిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories