Allu Arjun: అట్లీ.. అల్లు అర్జున్.. అదిరిపోయే కాంబో..

Allu Arjun: రాజా రాణి డైరెక్టర్ తో అల్లు అర్జున్

admin1
Updated on: 24 Jan 2022 4:14 PM IST
Allu Arjun Acting with Raja Rani Director
X

 రాజా రాణి డైరెక్టర్ తో అల్లు అర్జున్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే పుష్ప సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించారు. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా మలయాళం, కన్నడం, హిందీ మరియు తమిళ భాషల్లో కూడా కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ కోలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు అట్లీ. రాజా రాణి, తేరీ, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన అట్లీ ఈ మధ్యనే బిగిల్ సినిమాతో మరొక విజయాన్ని సాధించారు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన డిస్కషన్లు జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది అని తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప 2" బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి పట్టలెక్కనుంది. మరోవైపు అట్లీ కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. మరి అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story