Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ తో అల్లు అర్జున్ బిజినెస్..

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ తో అల్లు అర్జున్ బిజినెస్..
x

ADIPURUSH: ప్రభాస్ ఆదిపురుష్ తో అల్లు అర్జున్ బిజినెస్ 

Highlights

ఆదిపురుష్ సినిమాతో అల్లుఅర్జున్ బిజినెస్ చేయబోతున్నాడు.

ADIPURUSH: ఆదిపురుష్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు వారాల్లో ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో అంతకుముందు వచ్చిన నెగిటివిటీని అంతా పటా పంచలు చేసేసి దర్శకుడు ఓం రౌత్ యావత్ ప్రపంచం ఆదిపురుష్ కోసం ఎదురు చూసేలా చేశాడు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6న కలియుగదైవం వెంకన్న సన్నిధానం తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇండియన్ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ జరుగని రీతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. జై శ్రీరాం అనే శబ్దం వచ్చేలా బాణాసంచాను ఏర్పాటు చేస్తున్నారట. ట్రైలర్ తో పాటు పాటలు సైతం ఆదిపురుష్ చిత్రానికి క్రేజ్ ను పెంచాయి. ముఖ్యంగా జైశ్రీరామ్ పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటించగా రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హనుమంతుడి పోస్టర్ ను రిలీజ్ చేశారు.

గతంలో హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో హనుమంతుడు ధ్యానం చేసుకుంటూ చాలా ప్రశాంతంగా కనిపిస్తే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం హనుమంతుడు గదాధారియై రౌద్రంతో శత్రువులపై దండెత్తుతున్నట్లుగా ఉంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో ఆదిపురుష్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలాఉంటే, ఆదిపురుష్ సినిమాతో అల్లుఅర్జున్ బిజినెస్ చేయబోతున్నాడు. హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్ ను కొనుగోలు చేసి ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ గా మార్చేసిన ఐకాన్ స్టార్..తన మల్టిప్లెక్స్ ను ఆదిపురుష్ సినిమాతో లాంచ్ చేయనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories