సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్
x
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు' ఇండియా సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ వరుసపెట్టి సినిమాలు ఒకే చేస్తున్నాడు. ఇప్పటికే...

'నా పేరు సూర్య నా ఇల్లు' ఇండియా సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ వరుసపెట్టి సినిమాలు ఒకే చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాల తరువాత బన్నీ-త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కనున్న మూడవ సినిమా ఇది. గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవలేదు కానీ అప్పుడే మరొక సినిమా లైన్ లో పెట్టాడు.

తాజా సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'ఆర్య', 'ఆర్య-2', సినిమాలలో నటించాడు. సుక్కు దర్శకత్వంలో బన్నీ 'ఐ యాం దట్ చేంజ్' అనే షార్ట్ ఫిలిం లో కూడా నటించాడు. ఇక సుకుమార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సిన ఉంది. ఆ సినిమా పూర్తయ్యే లోపు బన్నీ కూడా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత బన్నీ, సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మైత్రి మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఫ్రెష్ సినిమా నా లేక 'ఆర్య 2' కి సీక్వెలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories