Allu Arjun: పుట్టిన ఊరు కోసం 20 లక్షలు డొనేట్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun: పుట్టిన ఊరు కోసం 20 లక్షలు డొనేట్ చేసిన అల్లు అర్జున్
x

Allu Arjun: పుట్టిన ఊరు కోసం 20 లక్షలు డొనేట్ చేసిన అల్లు అర్జున్ 

Highlights

Allu Arjun: జీవితంలో ఒక ఎత్తుకెదిగిన తర్వాత చాలామంది తాము పుట్టి పెరిగిన ఊరు గురించి మర్చిపోతుంటారు.

Allu Arjun: జీవితంలో ఒక ఎత్తుకెదిగిన తర్వాత చాలామంది తాము పుట్టి పెరిగిన ఊరు గురించి మర్చిపోతుంటారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పుట్టిన ఊరు, ఇచ్చిన మాటని మరిచి పోయే రకం కాదు. తాజాగా ఈ విషయాన్ని మరొక సారి నిరూపించుకున్నారు అల్లు అర్జున్. కొంతకాలం క్రితం తను పుట్టిన ఊరు పాలకొల్లు లోని ఒక గుడి నిర్మాణం చేస్తానని అల్లు అర్జున్ ప్రమాణం చేశారు. తాజాగా ఇప్పుడు తన మాట నిలబెట్టుకుంటా ఆ గుడికి 20 లక్షలు డొనేట్ చేసి వార్తల్లో నిలిచారు బన్నీ.

పాలకొల్లు లో పుట్టిన అల్లు అర్జున్ అక్కడ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి గుడి కొరకు 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఆ డబ్బుతో గుడివారు గోశాల, రథశాల మరియు వహనశాల కూడా నిర్మించారు. రామలింగేశ్వర స్వామి రథాన్ని కూడా చేయించారు. సంక్రాంతి పండగకు ముందే ఈ గుడి రెనోవేషన్ పూర్తయింది. పరమశివుడి పంచారామ క్షేత్రాలలో ఈ గుడి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "పుష్ప: ది రైజ్" సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప: ది రూల్" షూట్ తో బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories