Ustad Bhagath Singh: ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ‌..!

పవన్ కళ్యాణ్ కూతురి పాత్రలో అల్లు అర్జున్ కూతురు

Arun Chilukuri
Published on: 30 Jan 2023 11:31 AM IST
Allu Arha Will Act in Pawan Kalyans Next Movie Ustad Bhagath Singh
X

Ustad Bhagath Singh: ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ‌..!

Allu Arha: ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో "హరి హర వీర మల్లు" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా సైన్ చేశారు. ఈ సినిమాకు "ఉస్తాద్ భగత్ సింగ్" అనే టైటిల్ ను అనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. తమిళ్ లో విజయ్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "తేరి" సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే "తేరి" సినిమా ఇప్పటికే "పోలీసోడు" అనే టైటిల్ తో తెలుగులో కూడా డబ్బై మంచి విజయాన్ని సాధించింది.

అయితే పవన్ కళ్యాణ్ కోసం హరీష్ శంకర్ ఈ సినిమా లైన్ ని మాత్రమే తీసుకొని కథ మొత్తం మార్చేసారని కేవలం తండ్రి కూతుర్ల సెంటిమెంట్ మాత్రమే ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారట. తమిళ్ లో విజయ్ కూతురిగా ప్రముఖ నటి మీనా కూతురు నైనిక నటించగా తెలుగులో పవన్ కళ్యాణ్ కూతురుగా నటించడానికి హరీష్ శంకర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.

ఈ విషయాన్ని అల్లు అర్జున్ కి చెప్పగా బన్నీ కూడా ఓకే చెప్పారట. మెగా కాంపౌండ్ లో పుట్టిన పాప కాబట్టి అల్లు అర్హకి పవన్ కళ్యాణ్ బాగా తెలుసు. ఇప్పటికే వారిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉండే ఉంటుంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూతురుగా అల్లు అర్హా కనిపిస్తే బాగుంటుందని అభిమానులు కూడా అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story