Allu Aravind: అలీపై అల్లు అరవింద్ అందుకే సీరియస్ అయ్యారా?

Allu Aravind: అల్లు రామలింగయ్య వారసుడిగా, ప్రముఖ నిర్మాతగా అల్లు అరవింద్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Arun Chilukuri
Published on: 7 Oct 2022 1:02 PM IST
Allu Aravind Serious On Comedian Ali
X

Allu Aravind: అలీపై అల్లు అరవింద్ అందుకే సీరియస్ అయ్యారా?

Allu Aravind: అల్లు రామలింగయ్య వారసుడిగా, ప్రముఖ నిర్మాతగా అల్లు అరవింద్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీత ఆర్ట్స్ పతాకంపై ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు అల్లు అరవింద్. తాజాగా ఇప్పుడు ఓటీటీ రంగంలోనూ అరవింద్ దూసుకుపోతున్నారు. ఆహా ను స్థాపించి కార్పారేట్ ఓటీటీలకు ధీటుగా ఆహా తన ప్రత్యేకతని చాటుతోంది. ఇటీవలే అల్లు రామలింగయ్య స్టూడియోని కూడా స్థాపించారు అరవింద్. ఇలా బిజినెస్ పరంగా ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతూ ఉన్నారు అల్లు అరవింద్.

తాజాగా కమెడియన్ అలీ టాక్ షోకి అతిధిగా విచ్చేసారు అరవింద్. ఈ సందర్భంగా అలీ కొన్ని వివాదాస్పద అంశాలు టచ్ చేసినట్లు సమాచారం. వాటికి అంతే ధీటుగా అరవింద్ షాకింగ్ జవాబులు ఇచ్చారట. ఆరకంగా తాను అనుకున్నది అచీవ్ చేసినట్లు చెప్పుకోవచ్చు. అంతే కాకుండా తన తల్లి, సతీమణి గురించి చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. తన మనవరాలు అర్హ (అల్లు అర్జున్ కూతురు) గురించి చెబుతూ ఎక్కువ చెబితే దిష్టి తగిలేస్తుందని అన్నారు అరవింద్. ఇక గత కొన్ని రోజులుగా అల్లు ఫ్యామిలీ కి, మోగా ఫ్యామిలీకి మధ్య విబేధాలు వస్తున్నాయని వార్తలొస్తున్నాయని అలీ అడిగగా వివాదాస్పద విషయాలు ఏవైనా ఉంటే ముందే చెప్పమంటే అలాంటిదేమీ లేదు సర్ అని ఆపేశారు అలీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story