Allu Aravind: మెగా వార్ కు అల్లు అరవింద్ ఫుల్ స్టాప్

Allu Aravind: అల్లు - మెగా కుటుంబాల మధ్య మనస్పర్ధలు గురించి క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

Jyothi
Published on: 24 Aug 2022 12:57 PM IST
Allu Aravind Full Stop for Mega War
X

Allu Aravind: మెగా వార్ కు అల్లు అరవింద్ ఫుల్ స్టాప్

Allu Aravind: మెగా - అల్లు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అని ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వినిపించాయి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఈ పుకార్లు నిజం కాదని చెప్పినప్పటికీ ఆ పుకార్లకు మాత్రం ఫుల్ స్టాప్ పడదు. తాజాగా ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అని కొత్త పుకారు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అప్పట్లో అల్లు అర్జున్ ఒక ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అడగగా అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం లేపాయి ఇక మరోవైపు నెక్స్ట్ మెగాస్టార్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో సరికొత్త రచ్చ మొదలైన సంగతి తెలిసిందే.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూకి వచ్చారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా ఫ్యాన్స్ వార్స్ గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. "బన్నీకి చిరంజీవి అంటే దైవంతో సమానం. తన తుదిశ్వాస వరకు ఆ గౌరవం అలానే ఉంటుంది" అని స్పష్టం చేశారు. ఇక ఇరు కుటుంబాల మధ్య పోటీ గురించి మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలో చాలామంది విజయవంతమైన హీరోలు ఉన్నారని పోటీ కేవలం సినిమాల్లో మాత్రమే కానీ ఫ్యామిలీ పరంగా చూస్తే రెండు కుటుంబాలు ఒకటేనని చెప్పారు అల్లు అరవింద్. మారి ఇప్పటికైనా ఫ్యాన్ వార్ ఆగుతుందో లేదో చూడాలి.

Jyothi

Jyothi

Next Story