BangaruBullodu: బాలయ్య అభిమానుల్లో జోష్.. అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' సాంగ్ ప్రోమో రిలీజ్

BangaruBullodu: బాలయ్య అభిమానుల్లో జోష్..  అల్లరి నరేశ్ బంగారు బుల్లోడు సాంగ్ ప్రోమో రిలీజ్
x

 బంగారాబుల్లోడు మూవీ

Highlights

అల్లరి నరేశ్ తాజా చిత్రి బంగారు బుల్లోడు మూవీలోని స్వాతిలో ముత్యమంత సాంగ్ ఈ రోజు విడుదల అయింది.

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బిగెస్ట్ హిట్ సాధించిన చిత్రం బంగారు బుల్లోడు. అత్యధిక కేంద్రాల్లో ఆడిన ఈ సినిమా బాలయ్య కెరీర్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తిండిపోయాయి. అందులో వర్షంలో వచ్చే "స్వాతిలో ముత్యమంత" సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటుంది. వేటూరి అందించిన ఈ పాటకు బాలయ్య, రవీనా టండన్ వర్షంలో వేసే స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఇదే సినిమా టైటిల్‌తో అల్లరోడు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ టైటిలే కాదు ఓ పాటను కూడా మళ్లి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఇప్పుడు ఆ సాంగ్ విడుదలైన నాలుగు గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.

అల్లరి నరేశ్ పాత పాటను తన చిత్రాల్లో పెట్టుకోవడం కొత్తేమికాదు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ సాంగ్స్ కూడా తన మూవీలో రీమిక్స్ చేశాడు. తాజాగా అల్లరి నరేశ్ హీరోగా గిరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బంగారు బుల్లోడు'. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్‌ను చిత్ర యూనిట్ సోమవారం రిలీజ్ చేసింది. అయితే తాజాగా బాలయ్య బాబు సాంగ్ తన మూవీలో పెట్టుకోవడంతో ఆయన అభిమానులు ఓ రేంజ్ లో షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా విజయం సాధించాలని విషెశ్ చెబుతున్నారు.

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలోని "స్వాతిలో ముత్యమంత" సాంగ్ ను రేవంత్, ప్రియ ఆలపించారు. అల్లరి నరేశ్ సరసన పూజఝవేరి హీరోయిన్ గా నటిస్తోంది. AKఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ బాణీలు అందించారు. పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories