అల్లరి నరేష్ కి హ్యాపీ ఎండింగేనా

అల్లరి నరేష్ కి హ్యాపీ ఎండింగేనా
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం...

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాక ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర ఎలా ఉండబోతోందో అనే విషయంపై సోషల్ మీడియాలో డిబేట్ లు జరుగుతున్నాయి. కొందరేమో ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర చాలా కీలకంగా మారబోతోందని అంటున్నారు.

అంతేకాక 'గమ్యం' సినిమాలో గాలి శీను పాత్ర లాగానే 'మహర్షి' సినిమాలో కూడా అల్లరి నరేష్ పాత్ర చాలా బాగుంటుంది అని ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ పాత్ర చనిపోతుందనీ అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ సినిమాలో ట్రాజెడీ ఉండదని, అల్లరి నరేష్ పాత్ర సెకండాఫ్ మొత్తం మహేష్ బాబు పక్కనే ఉంటుందని అంటున్నారు. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే. దిల్ రాజు, పివిపి, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories