మహేష్ సినిమా ఈ కామెడీ హీరోకి ఉపయోగపడుతుందా?

Ruthvik
Published on: 3 May 2019 11:33 AM IST
మహేష్ సినిమా ఈ కామెడీ హీరోకి ఉపయోగపడుతుందా?
X

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న కామెడీ హీరో అల్లరి నరేష్ తాజాగా మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మే 9న విడుదల కాబోతున్న ఈ సినిమాలో నరేష్ పాత్ర పై ఇప్పటికే బోలెడు కథనాలు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం అల్లరి నరేష్ సినిమా పాత్ర ఈ సినిమా కథను కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని, ఆ పాత్ర సినిమా అయిపోయాక కూడా అందరికీ గుర్తుండిపోతుంది అని చెబుతున్నారు. మరి అలాంటి పాత్రకి అల్లరినరేష్ ఎంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటాడో చూడడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఈ సినిమా పక్కనపెడితే 'మహర్షి' సినిమా తరువాత అల్లరి నరేష్ కెరీర్ కొంచెం మెరుగు పడాలంటే ఈ సినిమాలో అతని పాత్ర కచ్చితంగా మెప్పించే విధంగానే ఉండాలి. మరీ మహేష్ బాబు పాత్ర అంత కాకపోయినా అల్లరి నరేష్ పాత్ర కు ఎక్కువ ప్రాధాన్యత ఉండాల్సిందే. అసలే సోలో హీరోగా మార్కెట్ చాలా తక్కువగా ఉండటంతో ఈ సినిమా ద్వారా అల్లరి నరేష్ తిరిగి ఫామ్ లోకి రావాలని ఆశిస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఈ సినిమాలో నరేష్ పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంటే అతనికి తరువాత కూడా మంచి ఆఫర్లే వస్తాయి అని చెప్పవచ్చు. మరోవైపు 'మహర్షి' ప్రమోషన్స్ లో అల్లరి నరేష్ అస్సలు కనిపించడం కూడా లేదు. మరి సినిమాలో అతని పాత్ర ఎంత వరకు మెప్పిస్తోందో వేచి చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story