మరొక మల్టీస్టార్రర్ లో కామెడీ హీరో

మరొక మల్టీస్టార్రర్ లో కామెడీ హీరో
x
Highlights

కామెడీ హీరోగా అల్లరి నరేష్ తన కెరీర్ లో చాలానే సూపర్ హిట్లు అందుకున్నాడు.కానీ గత కొంతకాలంగా నరేష్ ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. చాలా సినిమాలు డిజాస్టర్...

కామెడీ హీరోగా అల్లరి నరేష్ తన కెరీర్ లో చాలానే సూపర్ హిట్లు అందుకున్నాడు.కానీ గత కొంతకాలంగా నరేష్ ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. చాలా సినిమాలు డిజాస్టర్ గా మారిన తర్వాత ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' సినిమాలో ముఖ్య పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ కు ఒక టర్నింగ్ పాయింట్ గా మారుతుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే అల్లరి నరేష్ కు మరొక అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణా రెడ్డి ఓ సినిమాని తెరకెక్కించనున్నారట.

ఈ సినిమా ఒక మల్టీస్టార్రర్ అని, వేరొక హీరో కూడా ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి నిర్మించనున్నారు. తమిళ హీరో విజయ్ 'తుపాకి', 'పులి' వంటి భారీ చిత్రాల్ని తెలుగులో రిలీజ్ చేసింది ఈ సంస్థ. సుమారు 50 పైగా ఆంగ్ల- తమిళ అనువాద చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సంస్థ ఇప్పుడు నరేష్ తో మల్టీస్టార్రర్ నిర్మించనుంది. 'మహర్షి' రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అల్లరి నరేష్ ఇంతకుముందే సునీల్ తో 'సిల్లి ఫెల్లోస్' అనే మల్టీస్టారర్ చిత్రంలో నటించాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories