Navdeep: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. డ్రగ్స్ కేసులో ఉన్నవారందరూ నా స్నేహితులే

Navdeep: డ్రగ్స్‌కు నేను చాలా దూరంగా ఉంటా

Shekhar G
Published on: 23 Sept 2023 3:45 PM IST
All Those Involved In The Drug Case Are My Friends Says Navdeep
X

Navdeep: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. డ్రగ్స్ కేసులో ఉన్నవారందరూ నా స్నేహితులే

Navdeep: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌పై ప్రశ్నలో వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. ఐదు గంటలుగా పోలీసులు నవదీప్‌ను విచారిస్తున్నారు. మూడు బృందాలతో విచారణ కొనసాగుతుంది. నార్కోటిక్స్‌ టీమ్‌ హెడ్‌ సునీతరెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. నవదీప్‌కు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఉన్నవారందరూ తన స్నేహితులే అని నవదీప్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మీడియాలో కథనాలను చూసి తెలుసుకున్న వాళ్లు తనపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని విచారణలో తెలిపాడు నవదీప్. డ్రగ్స్‌కు తాను చాలా దూరంగా ఉంటానని పోలీసుల విచారణలో నవదీప్ తెలిపాడు.

Shekhar G

Shekhar G

Next Story