Check Movie: 'చెక్' టీంకు ఎన్టీఆర్ బెస్ట్ ఆఫ్ లక్

Check Movie: నితిన్ హీరోగా, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన 'చెక్' సినిమా 26న విడుదల కానుంది.

Venkata Chari
Updated on: 25 Feb 2021 9:30 PM IST
All the Best for Check Team
X

చెక్ మూవీ (ఫోటో ట్విట్టర్ )

Check Movie: నితిన్ హీరోగా, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన 'చెక్' సినిమా రేపు (ఫిబ్రవరి 26న) విడుదల కానుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ను అభినందిస్తూ ట్విట్టర్ లో ఆల్ ది బెస్ట్ చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR). వినూత్నమైన కథలతో సినిమాలు తీసే చంద్రశేఖర్ యేలేటికి నేను అభిమాని అంటూ ట్వీట్ లో వెల్లడించాడు. చెక్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాని పేర్కొన్నాడు. చెక్ టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని ప్రశంసలు కురిపించాడు.

కాగా చంద్రశేఖర్‌ చెప్పిన 15 నిమిషాల కథ విని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా అని నితిన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. 'చెక్‌' వేరని, ఇందులో తన నటన వెరైటీగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించాడు.


Venkata Chari

Venkata Chari

Next Story