Regina Cassandra: అబ్బాయిలను కొట్టేశా.. నా ఫిజిక్‌ను చూసి డామినేటింగ్ అంటున్నారు..

Regina Cassandra: గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రెజీనా కాసాండ్రా స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది.

Arun Chilukuri
Published on: 9 July 2022 11:55 AM IST
Alitho Saradaga Interview With Regina Cassandra
X

Regina Cassandra: అబ్బాయిలను కొట్టేశా.. నా ఫిజిక్‌ను చూసి డామినేటింగ్ అంటున్నారు..

Regina Cassandra: గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రెజీనా కాసాండ్రా స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. ఎప్పటినుంచో ఒక మంచి హిట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెజీనా తాజాగా "అన్యాస్ ట్యుటోరియల్" తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఆహా లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తుంది.

అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అలీతో సరదాగా" టీవీ షో లో సందడి చేసింది. ఈ షో లో మాట్లాడుతూ రెజీనా తన వ్యక్తిగత విషయాల తోపాటు కెరియర్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. "చిన్నప్పుడు స్కూల్లో యాంకరింగ్ చేసేదాన్ని. క్లాస్ లీడర్ గా ఉన్నప్పుడే అబ్బాయిలను కొట్టేదాన్ని. చాలామంది నన్ను డామినేటింగ్ అంటారు కానీ అది నా ఫిజిక్ వల్ల అయ్యుండచ్చు" అని చెప్పుకొచ్చింది రెజీనా.

"కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా నేను వెనుకాడను. నేను ఆ పాత్రకి సూట్ అవుతాను అని నాకు అనిపిస్తే కచ్చితంగా చేస్తాను" అని చెప్పిన రెజీనా "మనాలి లో ఒక హోటల్ లో కళ్ళకి మాస్క్ పెట్టుకొని నిద్రపోతుండగా ఎవరో నా నుదుటి మీద ముట్టుకున్నట్టు అనిపించింది. కానీ మాస్క్ తీసి చూస్తే అక్కడ ఎవరూ లేరు" అని తాను భయపడిన ఒక సంఘటన గుర్తు చేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story