NTR30: కియారా అద్వానీ లేక ఆలియా భట్ అంటున్న ఎన్టీఆర్

Alia Bhatt or Kiara Advani in NTR30 Movie
x

NTR30: కియారా అద్వానీ లేక ఆలియా భట్ అంటున్న ఎన్టీఆర్

Highlights

NTR30: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

NTR30: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ ఎపిక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాని అభిమానులు ఎన్టీఆర్30 అని పిలుస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ ని తీసుకోవాలని దర్శకనిర్మాతలు అనుకున్నారు. కానీ బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కియారా అద్వానీ మాత్రం రామ్ చరణ్ మరియు శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

డేట్లు ఎడ్జస్ట్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు వేరే ఆప్షన్ కోసం వెతకటం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఈ సినిమా హీరోయిన్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆలియా భట్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. అయితే 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఒకవైపు బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్న ఆలియాభట్ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో పెళ్లి కూడా చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. మరి ఈ సమయంలో ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories