Alia Bhatt: "ఆర్ఆర్ఆర్" ను పూర్తి చేసిన అలియా భట్

Sandeep Reddy
Published on: 26 July 2021 1:42 PM IST
Alia Bhatt Has Completed Shooting of RRR Movie
X

అలియా భట్ 

Alia Bhatt: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" సినిమాలోని తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ పూర్తి చేసుకుంది. ఇటీవల సినిమాలో రెండు పాటలతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ మిగిలి ఉండటంతో అలియా భట్ వారం రోజుల క్రితం ఆ షూటింగ్ లో పాల్గొంది. షూటింగ్ పూర్తైన వెంటనే ఈ భామ ముంబైకి వెళ్ళిపోయింది. ప్రమోషనల్ సాంగ్ కోసం వేసిన ఒక భారీ సెట్ లో ఈ సినిమా షూట్ జరిగింది. ఇక ఇటీవలే విడుదల చేసిన మేకింగ్ వీడియో సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

తెలుగు సినిమాలో సీత పాత్రతో ఎంట్రీ ఇస్తున్న అలియా భట్ సీత పాత్రలో ఉన్న పోస్టర్ ని రాజమౌళి అలియా పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా.. రామ్ చరణ్ "అల్లూరి సీతారామరాజు" పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ "కొమరం భీమ్" పాత్రలో కనిపించబోతున్నారు. దాదాపుగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story