అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులు డిలీట్‌ చేశా.. ఆలియా క్లారిటీ..

Alia Bhatt: తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను డిలీట్‌ చేసిందన్న వ్యాఖ్యలపై ఆలియా భట్‌ స్పందించింది.

Arun Chilukuri
Updated on: 1 April 2022 6:56 AM IST
Alia Bhatt Dismisses Rumours She Upset With RRR Team
X

అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులు డిలీట్‌ చేశా.. ఆలియా క్లారిటీ..

Alia Bhatt: తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను డిలీట్‌ చేసిందన్న వ్యాఖ్యలపై ఆలియా భట్‌ స్పందించింది. ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌ పట్ల తాను అసంతృప్తిగా ఉన్నట్టు, పలు పోస్టులను డిలీట్‌ చేసినట్టు తనపై అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. ప్రతిసారి తన ఇన్‌స్టాలోని పాత పోస్టులను తన ప్రొఫెల్‌ గ్రిడ్‌ నుంచి తిరిగి మారుస్తానని, అందులో భాగంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను మార్చానని స్పష్టం చేశారు.

యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనల ఆధారంగా అంచనాలు వేసి తప్పుడు విషయాలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్‌ ఆర్‌ లాంటి గొప్ప చిత్రంలో పాలుపంచుకోవడం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. సీత పాత్రని చాలా ప్రేమతో చేశానని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు ఆలియా.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story