Tollywood: 'అందరూ బావుండాలి అందులో నేనుండాలి' అంటున్న ఆలీ

Tollywood: టాలీవుడ్ కామెడీయన్ అలీ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Samba Siva Rao
Updated on: 24 March 2021 4:29 PM IST
Ali Andaru Bagundali Andulo Nenundali  Movie Updates
X

అలీ మూవీ 

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీనటుడు ఆలీ దశాద్ధాలుగా తనకంటూ ప్రత్యేక మార్క్ సృష‌్టించుకున్నాడు. హీరోగా నటిచించిన సినిమాల్లో యమలీలా వంటి చిత్రాలు హిట్స్ తెచ్చిపెట్టాయి. తనదైన కామెడీ శైలీని పండించడంలో ఆయనకు సాటి మరేవరు లేరు. అలా ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో కితకితలు పెట్టిన ఆలీ.. హీరోగా కూడా సత్తా చాటారు. అంతటితో ఆగక బుల్లితెరపై కూడా ప్రత్యేక షోలతో దూసుకుపోతున్నారు. ఇక అలీ నిర్మాతగా మారి 'అందరూ బావుండాలి అందులో నేనుండాలి' అనే మూవీ రూపొందిస్తున్నారు.

మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన వికృతి మూవీ ఆధారంగా ఈ 'అందరూ బావుండాలి అందులో నేనుండాలి' చిత్రం రూపొందుతోంది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీపురం కిరణ్‌ దర్శకుడు. అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనుంది చిత్రయూనిట్.

ప్రస్తుతం కాశ్మీర్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ''నా గుండె చిక్కుకుంది నీ కళ్లతో..'' అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రచించగా రాకేశ్‌ పళిదం బాణీలు కడుతున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పటికే మేజర్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.

ఆలీ హీరోగా నటిస్తుండగా మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాకేశ్‌ పళిదం సంగీతం అందిస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story