Comedian Ali: టాలీవుడ్ లో మహిళా కార్మికులకు అలీ దంపతుల సాయం

Comedian Ali: టాలీవుడ్ ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ మహిళా కార్మికులకు అలీ దంపతులు నిత్యావసర వస్తువులు అందజేశారు.

Kranthi
Published on: 24 May 2021 9:19 AM IST
Ali and his Wife Distributes Essentials to Women Production Union Members
X

Comedian Ali:(The Hans India) 

Comedian Ali: టాలీవుడ్ లో ఎవరికైనా కష్టం వస్తే తట్టేది అలీ ఇంటి తలుపునే. ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఎందుకంటే అలీ తాను చేసే సాయం కూడా గుట్టుగా చేస్తారు. సినిమాలు లేక నిరాశలో ఉన్నవారికి.. సినిమా తీసి అప్పులపాలైనవారికి వెన్నుతట్టి ధైర్యం చెప్పి.. మళ్లీ నిలబడేలా చేశారు అలీ. అంతెందుకు పూరీ జగన్నాథ్ సైతం తాను అలీ సాయం పొందినట్లు ఓపెన్ గా చెప్పారు. మరి కరోనా సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న టాలీవుడ్ సినీ కార్మికులను ఆదుకోకుండా ఉంటారా మరి అలీ.

కరోనా సెకండ్ వేవ్ తో తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ స్తంభించిపోయింది. దాంతో 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ కమెడియన్ అలీ, జుబేదా దంపతులు ఇవాళ టాలీవుడ్ ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. 10 కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, చక్కెర, మరో 8 రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. మొత్తం రూ.2 లక్షల వ్యయంతో 130 మందికి సాయం చేసినట్టు అలీ తెలిపారు.

ఈ మహిళా కార్మికులు తమకంటే ముందే షూటింగ్ స్పాట్ కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారని, తాము తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను కూడా శుభ్రం చేస్తుంటారని వివరించారు. కరోనా కారణంగా పని లేక వారు ఇబ్బంది పడుతుంటే తన వంతుగా స్పందించానని అలీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు ఖయ్యూం తదితరులు కూడా పాల్గొన్నారు.

Kranthi

Kranthi

Next Story