'అల' నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది!

Allu Arjun Ala Vaikunthapurramloo movie poster
x
Allu Arjun (File Photo)
Highlights

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో' పూజా హేగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. బన్ని స్టైలిష్ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్ కి అంతా ఫిదా అయిపోయారు. మొదటిరోజు నుంచి మంచి టాక్ ని సంపాదించుకున్న ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలిపారు ప్రేక్షకులు.. మరొ మూడు రోజుల్లో ఈ చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకోనుంది.

సినిమా విడుదలకి ముందే సినిమాకి తమన్ అందించిన పాటలు మంచి పేరును సంపాదించుకున్నాయి. అయితే ఇప్పుడు సినిమాలోని ఒక్కో పాటను వీడియో రూపకంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సామజవరగమనా, ఓ మైగాడ్ డాడీ , బుట్టబొమ్మ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయగా వాటికీ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు తాజాగా 'వైకుంఠపురములో' టైటిల్ సాంగ్ (వీడియో) విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ తన సొంత ఇంటికి వస్తున్న సమయంలో ఈ పాట వస్తోంది. ఈ పాట లిరికల్‌గానూ విజువల్‌గానూ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ ని అందించగా, శ్రీ కృష్ణ, ప్రియా సిస్టర్స్ కలిసి ఆలపించారు. విడుదల కొద్దిసేపటికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ పై కే రాధాకృష్ణ, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. టబు, నివేదా థామస్, సుశాంత్ , మురళీశర్మ, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు, తమన్ సంగీతం అందించాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories