యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న 'బుట్ట బొమ్మ' ఫుల్‌ వీడియో సాంగ్‌

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న బుట్ట బొమ్మ ఫుల్‌ వీడియో సాంగ్‌
x
యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న ‘బుట్ట బొమ్మ’ ఫుల్‌ వీడియో సాంగ్‌
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లోని పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి.

ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్ పెద్ద హిట్టైయ్యాయి. బుట్ట బొమ్మ పాటకు అల్లు అర్జున్ వేసిన స్టైలిష్ స్టెప్పులు అదరగొట్టాయి. థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు వేయించిన బుట్ట బొమ్మ ఫుల్ వీడియో సాంగ్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ పాట విడుదలైన గంటలోనే 5 లక్షల వ్యూస్ సంపాదించుకొని ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

పాట పూర్తి లిరిక్స్‌

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో

ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదునమ్మో

ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్మో

ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్మో

ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..

ఓరి దేవుడా.. ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే "2"

మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్మో

లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్మో

రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు..

అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే..

గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు..

చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే..

చిన్నగా సినుకు తుంపరడిగితే

కుండపోతగా తుఫాను తెస్తివే

మాటగా ఓ మల్లెపూవునడిగితే

మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..

జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే

వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే

కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో..

ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్మో..

ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్మో..

ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్మో..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories