Kannappa: కన్నప్పకి అక్షయ్ కుమార్ బై బై

Kannappa: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 4 May 2024 10:52 AM IST
Kannappa: కన్నప్పకి అక్షయ్ కుమార్ బై బై
X

Kannappa: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు అక్షయ్‌తో దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు మంచు విష్ణు.

‘‘అక్షయ్‌ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్‌.

మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను పెంచనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story