యూట్యూబర్‌కు భారీ షాక్ ఇచ్చిన అక్షయ్ కుమార్

యూట్యూబర్‌కు భారీ షాక్ ఇచ్చిన అక్షయ్ కుమార్
x
Highlights

ఓ యూట్యూబర్‌కు అక్షయ్ కుమార్ భారీ షాక్ ఇచ్చాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు 5వందల కోట్లరూపాయలకు పరువు నష్టం దావా వేశాడు. దీంతో బిహార్‌కు...

ఓ యూట్యూబర్‌కు అక్షయ్ కుమార్ భారీ షాక్ ఇచ్చాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు 5వందల కోట్లరూపాయలకు పరువు నష్టం దావా వేశాడు. దీంతో బిహార్‌కు చెందిన సిద్ధిఖీ అనే సివిల్‌ ఇంజనీర్‌పై కేసు నమోదైంది. హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌‌ కేసుతో సంబంధం ఉందంటూ తనపై ఫేక్‌ వార్తల్ని ప్రచారం చేశాడని అక్షయ్‌ ఫిర్యాదులో తెలిపారు.

ఇక సుశాంత్‌ కేసుతో అక్షయ్‌ని ముడిపెడుతూ సిద్ధిఖీ పలు వీడియోలు చేశాడు. ధోనీ లాంటి పెద్ద సినిమాలు సుశాంత్ చేయటం అక్షయ్‌కు ఇష్టం లేదని ఆదిథ్య ఠాక్రే, ముంబై పోలీసులతో అక్షయ్ పలుమార్లు రహస్య సమావేశాలు జరిపారని ఆరోపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇక సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి కెనడాకు పారిపోవటానికి కూడా అక్షయ్‌ సహాయం చేశాడంటూ మరో వీడియో చేశాడు. దీనిపై ఫైర్ అయిన అక్షయ్ పరువు నష్టం దావా వేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories