Akshay Kumar: అల్లు అర్జున్ నాతో సినిమా చేయాలి

Akshay Kumar: సౌత్ సినిమాల డామినేషన్ పై అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు

Sriveni Erugu
Updated on: 2 Jun 2022 3:30 PM IST
Akshay Kumar Comments on the Dominance of South Movies | Bollywood
X

అల్లు అర్జున్ నాతో సినిమా చేయాలి అంటున్న అక్షయ్ కుమార్ 

Akshay Kumar: ఈ మధ్యనే "బచ్చన్ పాండే" సినిమాతో అలరించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న "సామ్రాట్ పృథ్వీరాజ్" సినిమా జూన్ 3న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, సోనూసూద్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కుమార్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది సినిమాలు డామినేట్ చేయడం గురించి రిపోర్టర్ కి గట్టిగా సమాధానం ఇచ్చారు. "దయచేసి దేశాన్ని విభజించి పాలించే రకమైన దృశ్యాన్ని సృష్టించటం ఆపండి.

దక్షిణం, ఉత్తరం అని ఏదీ లేదు. ఇండస్ట్రీలోని నటీ నటులు కలిసి పని చేయాల్సిన సమయం వచ్చింది. అల్లు అర్జున్ త్వరలో నాతో పని చేయాలి నేను మరొక సౌత్ స్టార్ తో నటించాలి. ఇకపై అదే మార్గం" అని ఆయన చెప్పారు. ఈ మధ్య సౌత్ సినిమాల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న అక్షయ్ కుమార్ ఈ సారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story