Akkineni Samantha: సినిమా మరియు వెబ్ సిరీస్ ఆఫర్లతో బిజీగా ఉన్న సమంత

* సమంత పై కురుస్తున్న ఆఫర్ల వర్షం

admin1
Updated on: 8 Sept 2021 5:53 PM IST
Akkineni Samantha Busy With Web Series and Movie Offers
X

సమంత అక్కినేని (ట్విట్టర్ ఫోటో)

Akkineni Samantha: ఈ మధ్యనే "ది ఫ్యామిలీ మ్యాన్" సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత అక్కినేని ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో తన పేరు లో నుంచి అక్కినేని ని తొలగించడంతో నాగచైతన్యతో ఆమె విడిపోతున్నట్లు వార్తలు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారాయి. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు నచ్చిన అప్పుడు మాత్రమే ఇలాంటి పుకార్లకు రియాక్ట్ అవుతాను అని చెప్పిన సమంత ఇప్పుడు ప్రస్తుతం గోవాలో తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత "శాకుంతలం" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం సామ్ త్వరలోనే హైదరాబాద్ కి తిరిగి రాబోతోందట. వచ్చిన వెంటనే ఆమె సినిమాలు మరియు వెబ్ సిరీస్ తో బిజీ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్, మరో వైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో కూడా బాగానే సంపాదిస్తోంది సమంత. ఈ మధ్యనే "శాకుంతలం" సినిమా షూటింగ్ను పూర్తి చేసుకున్న సమంత అమెజాన్ మరియు నెట్ఫ్లిక్స్ కోసం కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అవి పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని వారాల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్టు తెలిపారు సమంత. నాగ చైతన్యతో విడాకుల విషయం గురించి సమంత ఇంకా రియాక్ట్ అవ్వాల్సి ఉంది.

admin1

admin1

Next Story