భర్తకు సమంత బర్త్ డే విషెస్!

భర్తకు సమంత బర్త్ డే విషెస్!
x
Highlights

నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నేడు 34వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నేడు 34వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాగచైతన్య లుంగీ కట్టుకొని, బనియన్ పైన కనిపిస్తున్నాడు. నాగచైతన్య ఇందులో చాలా సహజంగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ ని సమంత ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. భర్త నాగ చైతన్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ''ఎల్లప్పుడూ నీ సొంత ఆలోచనలతో ఇలాగే ముందుకెళ్లు.. నీకు నచ్చినట్లుగా హాయిగా జీవించు'' అని ట్వీట్ చేసింది సమంత.

ఇక లవ్ స్టొరీ సినిమా విషయానికి వచ్చేసరికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాని ఎమిగోస్‌ క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సమర్పణలో నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌రావు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరవాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories