ANR Centenary Celebrations: అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు

ANR Centenary Celebrations: వేడుకలకు హాజరైన పలువురు సినీ ప్రముఖులు

Shekhar G
Updated on: 20 Sept 2023 12:45 PM IST
Akkineni Nageswara Rao Centenary Celebrations At Annapurna Studios
X

ANR Centenary Celebrations: అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు

ANR Centenary Celebrations: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు నాగార్జున కుటుంబసభ్యులు. ఈ సందర్భంగా ANR విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఏఎన్నార్ శతజయంతి వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. శత జయంతి వేడుకలకు బ్రహ్మానందం, మోహన్‌బాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్, , జగపతిబాబు, మహేష్‌బాబు దంపతులు, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.

సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఏఎన్నార్ అద్భుతమైన స్థితికి చేరుకోవడం సామాన్య విషయం కాదన్నారు బ్రహ్మానందం. ఏఎన్నార్‌ను కారణజన్ముడని ఆయన కొనియాడారు. నట కుటుంబంలో జన్మించకున్నా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారన్నారు. గొప్ప చదువు లేకపోయినా, కేవలం నటన అనే క్వాలిఫికేషన్‌తో ఒక అధ్బుతమైన వ్యక్తిగా నాగేశ్వరరావు ఎదిగారన్నారు బ్రహ్మానందం.

Shekhar G

Shekhar G

Next Story