ఓటీటీలోనే నాగ్ కొత్త సినిమా?

ఓటీటీలోనే నాగ్ కొత్త సినిమా?
x
Highlights

ధియెటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అన్న అనుమానం నెలకొంది. దీనితో తెలుగు నిర్మాతలు మాత్రం ఎక్కువగా ధియెటర్లు కంటే ఓటీటీవైపే మొగ్గుచూపుతున్నారు.

ధియెటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అన్న అనుమానం నెలకొంది. దీనితో తెలుగు నిర్మాతలు మాత్రం ఎక్కువగా ధియెటర్లు కంటే ఓటీటీవైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిన కొన్ని చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీలో రిలిజ్ అయ్యేందుకు ఓ భారీ చిత్రం రెడీ అవుతుంది. అదే నాగార్జున హీరోగా వస్తున్న వైల్డ్ డాగ్ చిత్రం. ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.

ఇక ఇందులో ఎన్‌ఐఏ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా నాగ్‌ కనిపించనున్నారు. ఉపిరి, మహర్షి చిత్రాలకి కథ అందించిన అహిషోర్‌ సోలోమన్‌ దర్శకత్వంలో ఈ సినిమాని చేస్తున్నాడు నాగ్.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తుంది. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతుంది. దాదాపుగా 70 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరవాత ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాని చేయనున్నాడు నాగార్జున.

Show Full Article
Print Article
Next Story
More Stories