Bigg Boss 7 Telugu: 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్'.. సీక్రెట్ బయటపెట్టిన నాగర్జున.. ఏమన్నారంటే?

Bigg Boss 7: తెలుగు రియాలిటీ షో 'బిగ్‌బాస్' మరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సీజన్‌ 7కు సంబంధించి ఇప్పటికే హంగామా మొదలైంది. అయితే, ప్రతీ సీజన్‌కు ముందు ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎంతోమంది విమర్శిస్తున్నా.. 6 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది.

Arun Chilukuri
Published on: 24 July 2023 1:11 PM IST
Akkineni Nagarjuna Interesting Comments on Bigg Boss 7 Telugu Teaser
X

Bigg Boss 7 Telugu: 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్'.. సీక్రెట్ బయటపెట్టిన నాగర్జున.. ఏమన్నారంటే?

Bigg Boss 7: తెలుగు రియాలిటీ షో 'బిగ్‌బాస్' మరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సీజన్‌ 7కు సంబంధించి ఇప్పటికే హంగామా మొదలైంది. అయితే, ప్రతీ సీజన్‌కు ముందు ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎంతోమంది విమర్శిస్తున్నా.. 6 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బిగ్ బిగ్ 7 టీజర్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ 7 సీజన్‌ హోస్ట్‪‌ ఎవరేనేదానిపై చర్చ నడుస్తోంది. అక్కినేని నాగార్జున ఈ షో నుంచి తప్పుకొన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే, వీటికి చెక్ పెడుతూ నాగర్జున సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, షో గురించి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..' అంటూ పాత పాటను వినిపించి, ఏదో క్లూ ఇచ్చాడు. ఈ సీక్రెట్ ఏంటంటూ నెటిజన్లు తలపీక్కుంటున్నారు.

ఈ క్రమంలో ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది. ఆగస్టులో 7వ సీజన్‌ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో షో గురించి, సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేందుకు నిర్మాతలు భారీ ప్లాన్ చేస్తున్నారు. షో మొదలయ్యేందుకు చాలా సమయం ఉంది. ఈ క్రమంలో'బిగ్‌బాస్ షైనింగ్ స్టార్స్' భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. గత 6 సీజన్లలో ఈ షోలో పాల్గొన్న వారితో ఓ ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమోని నాగార్జున విడుదల చేశారు.

'కుడి ఎడమైతే..' అంటూ టీజర్‌లో నాగ్ చెప్పిన డైలాగ్‌కి అర్థమేంటో తెలుసుకోవాలని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ యాంకర్ సుమ.. నాగార్జునని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసిన నాగర్జున.. 'న్యూ గేమ్ న్యూ ఛాలెంజెస్ న్యూ రూల్స్' అంటూ సస్పెన్స్‌కు తెరదించారు. అయితే, ఈసారి బిగ్‌బాస్ 7లో ఏదో వెరైటీగా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story