Nagarjuna At Bigg Boss 4: బిగ్ బాస్ సెట్స్ లో నాగార్జున ఇలా.. ఫిక్స్ వైరల్!

Nagarjuna At Bigg Boss 4: బిగ్ బాస్ సెట్స్ లో నాగార్జున ఇలా.. ఫిక్స్ వైరల్!
x
Nagarjuna begins shoot for Bigg Boss Telugu Season 4
Highlights

Nagarjuna At Bigg Boss 4: లాక్ డౌన్ వలన దాదాపుగా షూటింగ్ లు అన్ని వాయిదా పడ్డాయి.. తాజాగా తెలుగు రాష్ట్రాల ఆదేశాల మేరకు

Nagarjuna At Bigg Boss 4: లాక్ డౌన్ వలన దాదాపుగా షూటింగ్ లు అన్ని వాయిదా పడ్డాయి.. తాజాగా తెలుగు రాష్ట్రాల ఆదేశాల మేరకు అతి తక్కువ మందితో వాయిదా పడిన షూటింగ్ లు మళ్లీ మొదలవుతున్నాయి.. అందులో భాగంగానే ఇటీవలే షూటింగ్ లు కూడా మొదలయ్యాయి. తెలుగు రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌-4'కు కూడా రంగం సిద్ధమైంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రచార చిత్రాలను కూడా మొదలు పెట్టేశారు. ఈ సందర్భంగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.



''తిరిగి షూటింగ్‌కు వచ్చేశా. లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌.. ఏం అద్భుతం... నిజంగా అద్భుతమే'' అని ట్వీట్‌ చేశారు. పీపీఈ కిట్లు ధరించి ఉన్న మేకప్‌ మెన్‌లు ఆయనను ప్రచార చిత్రాల షూటింగ్‌ కోసం సిద్ధం చేశారు. ఇక ఈ యాడ్ షూట్ ని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ సెట్ లో షూట్ చేశారు. దీనికి సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ యాడ్ కి ప్రముఖ కెమెరామన్ కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

అయితే నాగార్జున ఈ యాడ్ షూటింగ్ లో పాల్గొనడంతో ఈ సారి సీజన్ కి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక అటు కరోనా వలన ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఉంటుందా లేదా అని సందేహపడుతున్న అభిమానులకి స్టార్ మా ఆఫీషియల్ గా బిగ్ బాస్ లోగోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం కంటెస్టెంట్ లను ఎంపిక చేసే పనిలో ఉంది. చూస్తుంటే మరో రెండు మూడు వారాలలో షో మొదలయ్యే ఛాన్స్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories