నాగ చైతన్య మూవీలో సూపర్ స్టార్

నాగ చైతన్య మూవీలో సూపర్ స్టార్
x
Highlights

తెలుగు సినీమాల్లో హీరోలు తమ మూవీల్లో మరో హీరో పేరు చెప్పడానికి ఇష్టపడరు.

తెలుగు సినీమాల్లో హీరోలు తమ మూవీల్లో మరో హీరో పేరు చెప్పడానికి ఇష్టపడరు. అంతగా మరో హీరో పేరు వాడాల్సి వస్తే, తమ కుటుంబంలోని సీనియర్ హీరోల గురించే ప్రస్తావిస్తుంటారు. ఈ మధ్యనే సినిమాల్లో ట్రెండ్ మారుస్తున్నారు. ఒక హీరో సినిమాకు గాత్రదానం తో పాటు, స్పెషల్ అపీరియన్స్ ఇస్తున్నారు. కాగా..చైతు మరో అడుగు ముందుకెశాడు.

అక్కినేని నాగ చైతన్య హీరోగా 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' పేరిట ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాన సంఘానికి అధ్యక్షుడుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదు, అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్లో జరుగుతోంది. అక్కడ మహేశ్ సినిమా సందర్భంగా చైతన్య తన సహచరులతో చేసే హడావిడికి సంబంధించిన దృశ్యాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. నాగచైతన్య పేరు అభిరామ్ పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో ఉన్న బ్యానర్లను థియేటర్ ప్రాంగణంలో కట్టారు. మరోవైపు ఈ సినిమాలో కొన్ని నిమిషాలపాటు మహేశ్ బాబు తళుక్కున మెరవబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక అక్కినేని ఫ్యామిలీతో మహేశ్ బాబుకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి.

ఈ సినిమాలో నాగచైతన్య సరసన ముగ్గరు ముద్దుగుమ్మలు ఆడిపడనున్నారు. ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. అవికా గోర్‌ మరో కథానాయికగా కనిపించనుందట. మూడో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి వుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories