Agent: ఇక పాటలు వద్దు బాబోయ్ అంటున్న అక్కినేని అభిమానులు

Akkineni Fans Are Tense about the Agent Movie
x

Agent: ఇక పాటలు వద్దు బాబోయ్ అంటున్న అక్కినేని అభిమానులు

Highlights

Agent: "ఏజెంట్" సినిమా విషయంలో అక్కినేని అభిమానుల టెన్షన్

Agent: సినిమాల్లోకి రాక ముందు నుంచే అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ కి ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. "మనం" సినిమాలో అదిరిపోయే కామియో రోల్ లో అఖిల్ కనిపించినప్పటి నుంచి హీరోగా ఎప్పుడూ వెండితెరపై కనిపిస్తాడా అని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ అఖిల్ హీరోగా నటించిన మొదటి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో పర్వాలేదు అనిపించిన అఖిల్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే బాగుంటుంది అని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిల్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "ఏజెంట్" పైనే పెట్టుకున్నాడు.

సురేందర్ రెడ్డి ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. సినిమాకి సంబంధించి కొన్ని పాటలను విడుదల చేసింది. నిజానికి ఏ సినిమా కైనా బజ్ రావాలంటే సినిమాలో కనీసం ఒక్క పాట చార్ట్ బస్టర్ గా నిలిచినా చాలు. కేవలం ఒక్క పాట బావున్నా కూడా చాలామంది ప్రేక్షకులు థియేటర్ల దాకా వెళ్లి సినిమాలు చూస్తారు.

కానీ "ఏజెంట్" సినిమా పాటలను వింటూ అక్కినేని అభిమానులు సైతం ఇక పాటలు వద్దు బాబోయ్ అని మొరపెట్టుకుంటున్నారు. పాటలు సినిమాపై బజ్ ను పెంచేలా కాదు పూర్తిగా తీసేసేలా ఉన్నాయి అంటూ తల బాదుకుంటున్నారు. హిప్ హాప్ తమిజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇప్పటికే సినిమా నుంచి పలు పాటలు విడుదలయ్యాయి కానీ అందరూ ఒక్కటి కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మరి సినిమాపై రోజు రోజుకి తగ్గిపోతున్న క్రేజ్ విషయంలో చిత్ర బృందం ఏం చేస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories