Akhil Akkineni New Movie: అఖిల్ కోసం బరిలోకి స్టార్ డైరెక్టర్?

Akhil Akkineni New Movie: అక్కినేని హీరో అఖిల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు విజయాన్ని రుచి చూడలేదు.

Venkata Chari
Published on: 15 May 2021 4:49 PM IST
Star director on board for struggling star kid
X

అఖిల్ (ఫొటో ట్విట్టర్)

Akhil Akkineni New Movie: అక్కినేని హీరో అఖిల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు విజయాన్ని రుచి చూడలేదు. అఖిల్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం అఖిల్ తన నాలుగో సినిమాతోనైనా హిట్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' పై తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక అఖిల్ తన ఐదో సినిమా కోసం సైరా నరసింహ రెడ్డి ఫేమ్ సురేంద్ర రెడ్డితో జోడీ కట్టబోతున్న సంగతి తెలిసిందే. 'ఏజెంట్‌' గా రానున్న ఈ సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి. సిక్స్ ప్యాక్ బాడీతో ఈ సినిమాలో మొదటిసారి కనిపించనున్నాడు అఖిల్.

కాగా, అక్కినేని అఖిల్ కెరీర్‌పై నాగార్జున చాలా కంగారుపడుతున్నాడంట. అఖిల్ కోసం ఓ హిట్ సినిమాను తీసేందుకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో నాగార్జున చర్చలు జరుపుతున్నాడంట. ఈ మేరకు కొరటాల కూడా సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ సానుకూలంగా జరిగితే.. ఆరో సినిమా కొరటాల శివతో ఉండనున్నట్లు తెలియనుంది.

ప్రస్తుతం కొరటాల శివ 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నాడు. అది కాగానే జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండూ పూర్తయ్యాక అఖిల్ తో సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story