Akhil: విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది అంటున్న అక్కినేని హీరో

* కథ చాలా బాగుంటే తప్ప క్రీడ హైలైట్ అవ్వదు అంటున్న అఖిల్

admin1
Published on: 13 Oct 2021 4:22 PM IST
Akkineni Akhil says that he Interested to Act in Virat Kohli Biopic
X

అక్కినేని అఖిల్ (ఫైల్ ఫోటో)

Akkineni Akhil: యువ హీరో అక్కినేని అఖిల్ తాజాగా ఇప్పుడు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అఖిల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక అఖిల్ కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకున్న అఖిల్ ఏదైనా స్పోర్ట్స్ సినిమా చేసే ఆలోచన ఉందా అని అడగగా కథ చాలా బాగుంటే తప్ప క్రీడ హైలైట్ అవ్వదు అని, అలాంటి కథ తనకి ఇప్పటిదాకా తనకి దొరకలేదు అని చెప్పారు.

తనకి స్పోర్ట్స్ అంటే చాలా పిచ్చి అని ఆసక్తికరమైన స్పోర్ట్స్ కథ వస్తే కచ్చితంగా ఒప్పుకుంటాను అని అన్నారు. ఏ క్రీడాకారుడి బయోపిక్ లో తాను నటించాలని అనుకుంటున్నారు అని అడగగా అఖిల్ వెంటనే విరాట్ కోహ్లీ అని చెప్పారు. "ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ జర్నీ ప్యాషన్, ఫైర్ మరియు డెడికేషన్ తో నిండి ఉంటుంది. క్రికెట్ పై ఆయనకున్న డెడికేషన్ నన్ను చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఒకవేళ ఆయన జీవిత కథ పై సినిమా చేస్తే, అందులో నటించే అవకాశం దొరికితే బాగుంటుంది" అని అన్నారు అఖిల్.

admin1

admin1

Next Story