Akkineni Akhil: నాగార్జున తనకు ఇచ్చిన సలహా ఇదే అంటున్న అఖిల్

* ఫెయిల్యూర్ విషయం లో అఖిల్ కి నాగార్జున ఇచ్చిన సలహా

admin1
Updated on: 14 Oct 2021 12:35 PM IST
Akkineni Akhil says in Interview about his Father Nagarjuna Suggestions to him
X

అక్కినేని నాగార్జున -అఖిల్ (ఫైల్ ఫోటో)

Akkineni Akhil: అక్కినేని నాగార్జున తనయుడిగా అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పటికే అఖిల్ హీరోగా మూడు సినిమాల్లో నటించారు కానీ అందులో ఏ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" పైన పెట్టుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అఖిల్ కు తాజాగా తన కెరియర్ లోనే ఫెయిల్యూర్స్ గురించిన ఒక ప్రశ్న ఎదురైంది.

ఫెయిల్యూర్స్ గురించి తనకి నాగార్జున ఏమైనా సజెషన్స్ ఇచ్చారా అని అడగగా, అఖిల్ ఇలా అన్నారు. "మనం ఇండస్ట్రీకి ఒక్క సినిమా చేసి వెళ్ళిపోవడానికి రాలేదు. కాబట్టి హిట్, ఫ్లాప్ లను లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను వంద సినిమాలు చేస్తే అందులో 50 మాత్రమే హిట్ అయ్యాయి. మరో 50 ఫ్లాపయ్యాయి. ఒక్క సినిమా ఫ్లాప్ అయిందని నేను వెనక్కి తిరిగి వెళ్ళి పోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు. ఓడిపోయినప్పుడు నువ్వు చూపించే ధైర్యం నిన్ను బెటర్ పర్సన్ గా మారుస్తుంది. అప్పుడే నిన్ను ఇతరులు కూడా గౌరవిస్తారు" అని నాగార్జున అఖిల్ కు చెప్పారట.

admin1

admin1

Next Story