Akkineni AKhil: తన వీరాభిమాని పై ప్రశంసలు కురిపిస్తున్న అఖిల్

Akkineni AKhil: య్యగారు అనే పదాన్ని వినని వాళ్ళు ఉండరు. అయ్యగారు అంటే మరెవరో కాదు అక్కినేని అఖిల్

admin1
Updated on: 19 Oct 2021 7:00 PM IST
Akkineni Akhil Responds on his Fan in Interview
X

తన అభిమాని పై స్పందించిన అక్కినేని అఖిల్ (ఫైల్ ఇమేజ్)

Akkineni AKhil: అయ్యగారు అనే పదాన్ని వినని వాళ్ళు ఉండరు. అయ్యగారు అంటే మరెవరో కాదు అక్కినేని అఖిల్. ఒకసారి గూగుల్లో అయ్యగారు అని సెర్చ్ చేసి చూస్తే థియేటర్ బయట "హలో" సినిమా రివ్యూ ఇస్తున్న అఖిల్ వీరాభిమాని కనిపిస్తాడు. అతని పేరు నాగరాజు. ఆ వీడియో తో పాటు అతను కూడా చాలా పాపులర్ అయ్యాడు. అయ్య గారే నంబర్ వన్ అంటూ నాగరాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటించి సినిమా హిట్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అఖిల్ స్వయంగా నాగరాజు గురించి మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.

"నాగరాజు, మిమ్మల్ని ఒకసారి కలవాలి. మీ వీడియోలు చూశాను. నా కన్నా మీరు ఫేమస్ అయ్యారు. మీరు ఇచ్చిన అయ్య గారు అనే పదం నా జీవితాన్ని టేకోవర్ చేసింది. ఈ పదాన్ని మా సినిమాలో కూడా పెట్టేసారు. మీరు ఇంత పాపులర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడు క్షేమంగా ఉండాలి. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు" అని అన్నారు అఖిల్. ఇలా తన వీరాభిమాని పై ప్రశంసల వర్షం కురిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక సినిమాల పరంగా అఖిల్ త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "ఏజెంట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

admin1

admin1

Next Story